Tuesday , April 24 2018
Home / News / Regional News / వేద విద్యాలయం పై దాడి చేసిన దోషులను వెంటనే అరెస్టు చేయాలి : VHP

వేద విద్యాలయం పై దాడి చేసిన దోషులను వెంటనే అరెస్టు చేయాలి : VHP

వేదం భారత దేశ జీవననాదం, వేదాలకు పుట్టిల్లైన దేశంలోనే వేద పాఠశాల పై దాడి జగగడం హిందూ సమాజం అంగీకరించదు – శ్రీ రామ రాజు విహిప రాష్ట్ర అధ్యక్షులు

01-Dec-2017, భాగ్యనగర్ : హైదరాబాద్ నగరం లోని ఆర్ ఎస్ ఎన్ నగర్ లోని వేద విద్యాలయంపై కొన్ని రోజుల క్రితం జరిగిన బౌతిక దాడి పై విశ్వ హిందూ పరిషద్ తెలంగాణ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈ సంఘటన అత్యంత హేయమైనదిగాను, భారత రాజ్యాంగ లౌకిక స్పూర్తికి భంగం కలిగించే చర్యగా భావించి దాడికి కారణమైన దోషులను వెంటనే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేసింది.

నిన్న తేది : 30-Nov-2017 నాడు విశ్వ హిందూ పరిషద్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామరాజు గారు, శ్రీ గణేశానంద స్వామితో కలసి ఘటన స్థలాన్ని సందర్శించి వారిలో మనో దైర్యాన్ని అందించారు, ఈ సందర్భంలో శ్రీ రామ రాజు గారు మాట్లాడుతూ ‘ వేదం భారత దేశ జీవననాదం, వేదాలకు పుట్టిల్లైన దేశంలోనే వేద పాఠశాల పై దాడి జగగడం హిందూ సమాజం అంగీకరించదు, ఈ ఘటనకు కారకులని వెంటనే అరెస్టు చేసి కటినంగా శిక్షించే వరకు వదిలిపెట్టేది లేదు, అవసరం అయితే రాష్ట్ర వ్యాప్త ఆందోనలకు సిద్దం అని అన్నారు “

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *