Monday , December 17 2018
Home / News / Regional News / ధర్మ రక్షణ కోసం భజరంగ్ దళ్ లో చేరండి : మనోజ్ వర్మ జాతీయ సంయోజక్

ధర్మ రక్షణ కోసం భజరంగ్ దళ్ లో చేరండి : మనోజ్ వర్మ జాతీయ సంయోజక్

సిద్ధిపేట, 05-Dec-2017 : దేశ వ్యాప్తంగా జరుగుతున్న ‘ భజరంగ్ దళ్ భర్తీ అభియాన్ ‘ లో భాగంగా భజరంగ్ దళ్ జాతీయ సంయోజక్ శ్రీ మనోజ్ వర్మ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో సిద్ధిపేట లో జరిగిన కార్యక్రమంలో మార్గదర్శనం చేసారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది యువకులు భజరంగ్ దళ్ లో చేరారు.

ఈ సందర్భంలో శ్రీ మనోజ్ వర్మ గారు మాట్లాడుతూ ‘ భారత దేశ సంక్షేమం కోసం హైందవ చైతన్యం అవసరం, ఈ భూమి బిడ్డలం ఈ భూమికోసం ఆలోచించాలి, పరితపించాలి, పరిశ్రమించాలి అప్పుడే భవ్య భారత నిర్మాణం అవుతుంది, ఈ దృక్కోణం లో భజరంగ్ దళ్ పని చేస్తూ ఉంది’ అని అన్నారు.

ఈ కార్యక్రమం లో భజరంగ్ దళ్ తెలంగాణ సహా సంయోజక్ సుభాష్ చందర్, స్థానిక సంఘటన మంత్రి కొత్త నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *