Sunday , September 22 2019
Home / Articles / ఎవడ్రా రాణి పద్మిని లేదన్నది ? – చూడండి చరిత్ర పుటల్లో కనిపిస్తుంది

ఎవడ్రా రాణి పద్మిని లేదన్నది ? – చూడండి చరిత్ర పుటల్లో కనిపిస్తుంది

ఎవడ్రా రాణి పద్మిని లేదన్నది ? ఆ తల్లి అపూర్వ జోహార్ కాల్పనికం అన్నది ? ఇంకెవరు, శ్రీ సయ్యద్ ఇర్ఫాన్ హబీబ్ అంకుల్ చెప్పారు. ఆయన చెపితే నిజమే చెపుతారు.. కాబట్టి మన అల్ప బుద్దికి తెలిసి క్రింది విషయాలని వెంటనే మర్చిపోదాం.. లేకపోతే దేశంలో అసహనం పెరిగిపోతుంది, సెక్యులరిజం చచ్చిపోతుంది.. కాబట్టి వెంటనే మర్చిపోదాం..

రావల్ రత్నసింగ్-

దరీబ్ రాతలను బట్టి రావత్ అమర్ సింగ్ తరువాత రావత రత్నసింగ్ విక్రమ సం. 1359 మాఘ సుద్ది (శుక్ల పక్ష) 5వ తేది బుధవారం చితౌడ్ రాజ్యాధికారాన్ని చెప్పట్టాడు.  జైన్ గ్రంథాలైన నాభినందన్-జీర్ణోద్ధార్ ప్రభధాలను బట్టి రత్నసింగ్, ఒక రాజుగా లిఖించబడింది. అదే విధంగా అమర వంశావళిలో కూడా రత్నసింగ్‌ని ఒక శాసకుడిగా వర్ణించింది. రాజస్థాన్ త్రూ ది ఏజెస్, పేజి 664-65, సోమాని, వీర భూమి చితౌడ్ పేజి 30-35 ఈ చారిత్రిక విషయాలను స్పష్టం చేస్తున్నాయి.

.

గోరాబాదల్-

డా. హుకుమ్ భాఠియా రాసిన సోన్‌గరా సంచోరా చౌహానో కా ఇతిహాస్, పేజీ 45లో గోరా, బాదల్ వీరిద్దిరూ జాలోర్ (రాజస్థాన్)కి చెందిన సోనగరా చౌహాన్లు. గోరా, బాదల్‌కి బాబయ్య. చితౌడ్ రావడానికి పూర్వం ఇతడు గుజరాత్‌కి చెందిన శాసకుడైన వీసలదేవ్ సోలంకికి ప్రధాన్‌గా ఉండేవాడు. పద్మావతి పరిణయం తరువాత ఇతడు చితౌడ్ వచ్చాడు. గోరా, రాణి పద్మినికి మామయ్య, బాదల్‌ తల్లికి అన్నయ్య.

.

రాఘవ్ చేతన్-

వి.సం. 1422లో సమ్యకత్వ కౌముది యొక్క నివృత్తిలో గణేశ్వర్ సురి, శిష్యుడు తిలక సురి, సుల్తాన్ ద్వారా రాఘవ్ చేతన్‌ని సన్మానించినట్లు రాసాడు. ఈ సంఘట కాంగడా రాజు సంసార చంద్ర యొక్క ఒక ప్రసస్థి పత్రం రాసిన దానిని బట్టి మరింత బలపడింది. బుద్దివిలాస్ ఆది గ్రంథంలో కూడా రాఘవ్ చేతన్ యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఆధారాలతో రాఘవ్ చేతన్ ఒక చారిత్రిక వ్యక్తి అని నిర్ధారించబడుతుంది. ప్రారంభంలో చితౌడ్‌లో ఉండడం, తరువాత దిల్లీ దర్బార్ చేరడం ఆశ్చర్యకరమైన విషయం కాదు అంటారు వీరభూమి చితౌడ్ రాసిన సోమానీ.

 

రాణి పద్మిని-

కొందరు చరిత్రకారులు పద్మినిని భాటియాల పుత్రిక అని జైలస్మేర్‌కి చెందిన భాటియాల ఖ్యాతి, చారిత్రిక రచనల ఆధారంగా రాణి పద్మిని పంగుల్‌కి స్వామి అయిన పూనపాల్‌జీ పుత్రిక అని, ఆమె 1285సం.లో జన్మించినట్లు, 1300సం.లో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. రావల్ పూనపాల్‌జీ, రాణి జామ్‌కేంవర దేవడీ, సింహల్‌వాడ రాజైన హమీర్ సింహ్ దేవడ్ పుత్రిక.

మాలిక్ ముహమ్మద్ జాయసీ (1477-1542)-

ఇతడు రాయబరేలీ, ఉత్తర ప్రదేశ్‌లో జన్మించి, మేరఠ్, ఉత్తర ప్రదేశ్‌లో మరణించిన ఇతడు రాసిన “పద్మావత్”‌లో చితౌడ్ సంఘటన జరిగిన 237 సం. తరువాత అవథీ భాషలో రాసాడు. ఇతడు స్థానికంగా ప్రసిద్ధి పొందిన హిరామన్ సుగ్గు రాసిన లోక కథలో చెప్పిన రతన్ సింగి రాణి పద్మిని కోసం లంక వెళ్ళడాన్ని చెప్పడాన్నే జాయసీ తన రచన పద్మావత్‌లో క్రోడికరించాడు. ప్రముఖంగా, ఈ పుస్తకంలోని కథ ఆధారంగా, హబీబ్, ఆయనలాంటి మరికొందరు చరిత్రకారులు పద్మిని లేదని వాదిస్తూ కనిపిస్తారు.

అమీర్ ఖుసరో-

“ఇన్ ఉల్ ఫుతూహ్” అనే పుస్తకం రాసాడు. ఇది జాయసీ యొక్క “పద్మావత్” తరువాత రాయబడిన పుస్తకం. ఇందులో రాణి ఉన్నట్లు చెప్పకపోయినప్పటికి చితౌడ్‌పై దాడి జరిగిందని రాసాడు. కానీ రాణి గురించి ప్రస్తావన లేనంత మాత్రాన పద్మిని లేదని నిర్ణయించడం తగదు.

Col James Tod, an officer of British East India Company-

“The Annals & Antiquities of Rajastan” అనే పుస్తకం రాసాడు. కర్నల్ టాడ్ రాసిన రాతలలో మేవాడ్ భాట్‌ల ద్వారా విన్న కొన్ని కధలను జోడించి రాసినప్పటికీ, టాడ్ జరిగిందని రాసిన చిత్తోడ్ యుద్ధం, రాజు మరణం, పద్మిని జోహర్‌ని చాలా మంది చరిత్రకారులు వాస్తవంగా జరిగినట్లుగా ఒప్పుకున్నారు

గౌరీ శంకర్ హీరా చంద్ ఔఝా-

వీరు రాజ్‌పూత్ చరిత్రకి సంబంధించి రాసిన చరిత్ర పుస్తకాలను, ఇతర చరిత్రకారులెందరో చాలా వరకూ ప్రామాణికంగా స్వీకరిస్తారు. ఓఝాగారు చెప్పిన, ఖిల్జీ ఆక్రమణ, రాజు మరణం, పద్మిని జౌహర్ వాస్తవమని, మిగిలినవి కల్పనలని (వీటిలో కొన్ని 1303వి కాక 1531వి) తెల్చిన విషయాన్ని చాలామంది చరిత్రకారులు ఒప్పుకుంటున్నారు.

ఆశీర్వాదీ లాల్ శ్రీవాస్తవ్, గోపీనాథ్ శర్మ లాంటి చరిత్రకారులు కూడా-

ఓఝాగారి భావించినట్లుగానే, పద్మిని కథలోని చాలా విషయాలు కల్పితమని అన్నప్పటికీ,  పద్మినిని మాత్రం ఉందిని స్వీకరించారు. ఈ విధంగా ఓఝాగారి వాదనని చాలా మంది చరిత్రకారులు సమర్థించారు.

డా. గోపీనాథ్ శర్మగారు-

“జాయసీ” రాతలకంటే శతాబ్దాల ముందు రాసిన “చితాయీ చరిత్ర”లో పద్మిని, ఖిల్జీ ఆక్రమణ వర్ణన ఉండగా, పద్మినిని కల్పితం అనడం అజ్ఞానమని వాదించారు. ఇంకా, “హేమరతన్” యొక్క “గోరా-బాదల్”, చౌపాయీ మరియు “లబ్ధబోధ్”లోని పద్మిని చరిత్ర స్వతంత్రంగా రాసినవని నిర్థారించారు. వీటి ద్వారా కూడా పద్మిని అస్తిత్వం నిర్థారించబడుతోంది.

.

తారీఖ్-ఎ-ఫతహ్-

ఈ పుస్తకంలో కూడా జోహర్ ఘటన జరిగిందని ఉల్లేఖించబడింది. ఈ వివరణ పద్మావతి సినిమా నేపధ్యంలో, ఖిల్జీనీ, మత సమరస్య వీరుడిగా చిత్రీకరించడంలోని డొల్లతనాన్ని బయటపెడుతుంది..

.

ఫ్రో. సత్యన్నారాయణ సమదానీ, మీరా పరిశోధన సంస్థాన్-

చిత్తోడ్ ఘడ్‌కి చెందిన “పద్మావత్” 1540 సం. రచన అని. జాయసీ అజ్మేర్ వచ్చినపుడు అక్కడ బైన్ అనే కవి దగ్గర పద్మిని వర్ణన అప్పటికే ఉందని, దీనిని బట్టి జాయసీ, “హేతమ్ దాన్” రాసిన “గోరా బాదల్” కవిత నుండి కొంత సమాచారాన్ని తీసుకున్నాడని, దీనిని బట్టి పద్మిని కల్పన అనడానికి అవకాశం లేదని నిర్ణయించారు. “చితాయీ చరిత్ర”లో రాసినట్లు ఖల్జీ నిస్సందేహంగా, దేవగిరి, చితౌడ్ స్త్రీలను చెరపట్టడానికి మాత్రమే దాడి చేసాడని, అటువంటి విలన్‌ని, హీరోగా చూపించడం సహించరానిదని కూడా అన్నారు.

“చితాయీ చరిత్ర”-

జాయసీ యొక్క “పద్మావత్” కంటే 14 సం. ముందు రాయబడిందని చెపుతూ సమదానీ, “చితాయీ చరిత్ర”ని గ్వాలియర్ కవి అయిన “నారాయణ దాసు” రచించాడని, ఈ చేతిరాత గ్రంథాన్ని ఎడిటింగ్ చేసిన గ్వాలియర్‌కి చెందిన “హరిహరనాథ్”, “ఆగర్ చంద్ నాహడా” అనే వారు దీని రచనా కాలాన్ని 1540గా పెర్కొన్నారని, ఇందులో ఖల్జీ దేవగిరి రాణిని వశం చేసుకునే నిమిత్తం దేవగిరిపై దాడి చేసినట్లు రాయబడింది నిర్థారించారు.

ఇంకా, “చితాయీ చరిత్ర”లో ఈ దాడి సందర్భంగా ఖిల్జీ, “రాఘవ చేతన్‌”తో చితౌడ్‌లో రాణి పద్మిని అనే అందంగత్తే ఉందని, అక్కడి రాజు రతన్ సింగ్‌ని బందీ చేసాను కానీ, బాదల్ అతడిని విడిపించుకుపోయాడని చెప్పినట్లు వ్రాయబడిందని తెలియజేసారు. ఈ విషయం కూడా రాణి పద్మిని అస్తిత్వాన్ని నిర్థారిస్తుంది.

ఏ.ఎల్. జైన్, హిస్ట్రీ రీసర్చ్ మరియు చితౌడ్ పీజి కాలేజి మాజీ ప్రిన్సిపల్-

ఈయన “దేబారీ” అనే ప్రాంతంలో, 1359 మాఘ పంచమి బుధవారం అనే శిలాఫలకం లభించిందని, అందులో రత్నసింగ్ ప్రస్తావన ఉన్నట్లు తెలియజేసారు. ఖిల్జీ, పద్మావతి, రత్నసింగ్ కథ ఆ కాలంలో అంతటా చర్చలో ఉండేదని నిర్థారించారు.

ఫరిస్తా అనే చరిత్రకారుడు గుల్షన్-ఎ-ఇబ్రహీమ్ (1589) పుస్తకాన్ని రాసాడు-

ఇతడి కథనం ఖిల్జీ చాలా సులభంగా రత్నసింగ్‌ని బందించి తీసుకుపోతాడు. రాణి, కుటుంబంలోని ఇతర బంధువులు ప్రాణం రక్షించుకుని అడవిలోకి పారపోతారు. ఖల్జీ రాణి అందం గురించి విని, ఆమెకి బదులుగా, రాజుని విడిచిపెడతానని చెప్పగా, రాణి ఖిల్జీపై ఆక్రమణ చేసి రాజుని విడిపించుకుపోతుందని రాయబడింది. ఈ కథనంలో కూడా రాణి అస్తిత్వాన్నే బలపరుస్తుంది.

ప్రముఖ చరిత్రకారుడైన ఆర్.వి. సింగ్-

ఈయన రాసిన రాజ్‌పూతానా చరిత్ర పుస్తకంలో పద్మిని. ఆమె జోహర్ చరిత్రని ప్రస్తావించారు.

రాజపూత్ సమాజం యొక్క కరణీ సేనకి అధ్యక్షులైన లోకేంద్ర సింగ్ కల్వీ-

రాజ్‌పూత్ సమాజం దగ్గర రాజ్‌పూత్‌లకి సంబంధించి విస్తృతమైన గ్రంథాలంయ ఉందని, అందులో ఎక్కాడా పద్మీనీని ఖిల్జీ ప్రేమికురాలుగా ప్రస్తావించలేదన్నారు.

స్థానిక స్కూల్, కాలేజీలలో-

బి.ఎ. పార్ట్-1,2, ఎమ్.ఎ., మొదటి, రెండవ సంవత్సరం పాఠ్యాంశాల ఆధారంగా బహిర్గతమైన విషయాలపై, ఆ ప్రాంతంలోని చరిత్రకారుల మధ్య జరిగిన చర్చ ద్వారా, చితౌడ్‌కి 42వ రాజైన రాజా రత్నసింగ్‌కి 15 మంది రాణులు ఉండేవారని అందులో రాణి మదన్ కవర్ పద్మిని ఒక్కత్తే అని నిర్థారించచబడింది. ఇక్కడ కూడా రాణీ పద్మిని అస్తిత్వంలో ఉంది.

కృష్ణ గోపాల్ శర్మ, రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో చరిత్ర ప్రోఫెసర్-

ఈయన రాణి పద్మిని, రావత్ రతన్ సింగ్ యొక్క 15వ భార్య అని, ఆమె శ్రీలంకకు చెందిన ఒక చారిత్రిక వ్యక్తి అని, స్వయంవరం ద్వారా రాజా రతన్ సింగ్‌ని పెళ్ళి చేసుకున్నారని నిర్థారిస్తూ, పద్మిని కోసం, ఖిల్జీ చితౌడ్‌పై దాడి చేయడాన్ని, పద్మిని అందాన్ని అతడు ప్రతిబింబంగా చూడడాన్ని ఖిల్జీ చుట్టు అల్లిన కట్టు కథ అన్నారు.

లోకేంద్ర సింగ్ చూడావత్, చితౌర్ ఘర్ ప్రభుత్వ పి.జి. కాలేజిలోని చరిత్ర విభాగాధిపతి-

ఈయన, ఖిల్జీ, రాణిపై మోహాన్ని పెంచున్నాడన్నది కట్టుకథ అని శర్మగారు చెప్పిన దానితో ఏకీభవిస్తూ, పద్మిని శ్రీ లంక నుండి వచ్చిందనే శర్మగారి వాదనని, జాయసీలో చెప్పిన విషయాన్ని కూడా తిరస్కరించారు. పద్మావతి, బీకానేర్జైసల్మేర్ మధ్య ఉన్న పుంగల్ ప్రదేశ్ ప్రాంతంలో జన్మించిందని నమ్ముతున్నట్లు చెప్పారు.

రిమా హుజా, చరిత్రకారిణి చెప్పిన మాట-

ఈమె “ఎ హిస్టరీ ఆఫ్ రాజస్థాన్” అనే పుస్తకం రాసారు. ఈమె పద్మిని గాథకి ఎవరో ఒక స్త్రీ ప్రేరణ అయి ఉండవచ్చని, తార్కికంగా ఆలోచిస్తే రావల్ రతన్ సింగ్ మరణం తరువాత కూడా గుర్తుండిపోయే సాహసం చేసిన ఆమె ఉండి ఉన్నట్లు అనిపిస్తుందని, వాస్తవం, కథకి, చరిత్రకి మధ్యన ఎక్కడో దాగి ఉందని, పద్మిని తన జీవితాన్ని బలి చేసిన కారణంగా ఆమెపై భక్తి ఏర్పడి ఉండవచ్చని అన్నారు.

.

మేనా గౌర్, Former professor and faculty chairperson of Humanities in the Mohalal Sukhadia University at Udaipur-

ఈమె, పద్మిని కథ యొక్క కల్పన పూర్తిగా జాయసీ ఊహ ద్వారానే జరిగిందని చెప్పలేమని అన్నారు. నేటికి కూడా, చితౌడ్ ఘర్ కోట లోపల ప్రితిబింబం పడిన స్థలం, ఖిల్జీ ప్రతిబింబం చూసిన చోటు ఉన్నాయి. నిజంగా ఇవి అన్నీ కల్పితాలేనా? కల్పితమైన పద్మావతి అనే ఆమె చుట్టూ వీటిని అల్లారా? అని ప్రశ్సిస్తూ, జాయసీ పద్మావత్ రాయడానికి కూడా ఏదో ఒక ప్రాతిపదిక ఉండే ఉంటుందని నేను భావిస్తునానని అన్నారు.

.

 

పద్మిని లేదంటూ కొన్ని సందర్భాలు, పుస్తకాలు ఉండవచ్చు. ఖిల్జీ ఇంత యుద్ధం చేసి అతడికి పద్మినికి బదుల బూడిద లభించిన కారణంగా ఖిల్జీ కనీస గౌరవానికైనా భంగం కలుగకుండా చెద్దామనే ఉద్దేశ్యంతో కొందరు రాయసగాళ్ళు పద్మిని పాత్రనే తీసేవేసి ఉండవచ్చని అనడానికి ఆస్కారం లేకపోలేదు.

.
ఈ నేపధ్యంలో ఎవరైనా పద్మిని లేదని, మేము చెప్పిందే చరిత్రని అంటే మనం ఎంత మాత్రం పట్టించుకోవలసిన పని లేదు… కాబట్టి పద్మిని ఉండేది. ఎప్పటికీ ఉంటుంది. ఆమె అస్థిత్వం ఒక చారిత్రిక సత్యం. అమె భారతీయ స్త్రీజాతికి ధైర్యం, మన అందరికి గౌరవం. ఆచంద్ర-తారార్కం ఆమె మనకి స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటుంది. జోహార్ పద్మిని.*

About లక్ష్మి

Check Also

ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్న ముస్లీం జనాభా పెరుగుదల – 7 ప్రశ్నలు

ఈ మద్యనే నేను భారతదేశంలో ‘మత ప్రాతిపదిక గణాంకాలు’ అనే అంశంపై చర్చలో పాల్గొన్నాను. అందులో వచ్చిన స్పష్టమైన ప్రశ్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *